01-12-2025 07:28:06 PM
చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండల కేంద్రంలోని రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో మహేష్ విద్యార్థిని ప్రిన్సిపాల్ సిబ్బంది అభినందించినారు. నవంబర్ 29వ తేదీ నుండి నేటి వరకు అల్ఫోర్స్ ఈ- టెక్నో, కొత్తపల్లి, కరీంనగర్ లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో జూనియర్ విభాగంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, రుక్మాపూర్ క్యాడేట్ ఆర్ సామ్రాట్ ద్వితీయ బహుమతికి ఎంపికయ్యాడు. క్యాడేట్ ను, మెంటర్ టీచర్ మహేష్ ను పాఠశాల డైరెక్టర్ కర్నల్ రాజాదత్త, ప్రిన్సిపాల్ వి. లింగయ్య, శ్రీనివాస్, ప్రమోద్ రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.