calender_icon.png 17 September, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తా

17-09-2025 03:05:55 PM

ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య..

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథిగా వచ్చిన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah)ను తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జనగామ జిల్లా అధ్యక్షుడు భూష రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కలవడం జరిగింది. బిర్లా ఐలయ్యకు, యూనియన్ సభ్యులు జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలు, ఉన్న ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేయు వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్, కోశాధికారి నవీన్ చారి, కార్యదర్శులు, అప్రోజు, సాంబ చారి, పరశురాములు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.