calender_icon.png 17 September, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనహిత ఆధ్వర్యంలో అన్నదానం

17-09-2025 03:13:31 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద జనహితసేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం నాగుల నాగేష్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం నిర్వహించారు. దాతల సహకారంతో 360 వ సారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు భీమిని కనకయ్య, సకినాల రాజేశ్వరరావు, నిచ్చ కోల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.