calender_icon.png 17 September, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమోచన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణ

17-09-2025 04:18:25 PM

మోడీ జన్మదిన సందర్బంగారక్తదాన శిబిరం..

చిట్యాల (విజయక్రాంతి): బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.  చిట్యాల పట్టణ కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా  బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని  ఘనంగా నిర్వహించారు. అనంతరం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్బంగా పట్టణ కేంద్రంలో రక్తాదాన శిబిరం ఏర్పాటు చేశారు. చిట్యాల టౌన్, మండలం, రామన్నపేట, నార్కట్ పల్లి మండలాల బీజేపీ నాయకులు, కార్యాకర్తలు రక్తా దానం చేశారు. బీజేపీ నాయకులు నకిరేకంటి మొగులయ్య, మైల నర్సింహా, పాల్వాయి భాస్కర్ రావు, మాస శ్రీనివాస్, కన్నేబోయన మహాలింగం, పీక వెంకన్న, శ్రీనివాస్, బండ మధుకర్, కూరెళ్ల శ్రీను, పొట్లపల్లి నర్సింహా, పల్లె వెంకన్న,  గంజి గోవర్ధన్, ఈడుడల  మల్లేష్, బీజేపీ చిట్యాల, రామన్నపేట, నార్కట్ పల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.