calender_icon.png 17 September, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

17-09-2025 03:48:02 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. సెప్టెంబర్ 17న పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం నిర్వహించింది. వలిగొండ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమాలలో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్ఐ యుగేందర్ గౌడ్, ఏవో అంజనీ దేవి, ఎంఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.