17-09-2025 03:46:04 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy) సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులను నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం వలిగొండ పట్టణ కేంద్రంలో అనుమతి లేకుండా వెంచర్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వెంచర్ వద్దకు వెళ్లి నిర్వాహకులను అనుమతి లేకుండా ఫ్లాట్లు చేయవద్దని ఆదేశించారు. అనంతరం మల్లేపల్లిలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, ఏఈ కిరణ్ పాల్గొన్నారు.