17-09-2025 03:00:30 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో డోంగ్లి మండలం మొఘ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ ఎఏంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఉప సర్పంచ్ నగేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగ్రామ్ పటేల్, సుధాకర్ గౌడ్, సాయి పటేల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు వున్నారు.