29-09-2025 01:18:07 AM
కాంగ్రెస్, బీజేపీలకు మున్నూరు కాపు సంఘం విజ్ఞప్తి
ఖైరతాబాద్, సెప్టెంబర్ 28(విజయ క్రాం తి): రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరుకాపులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసి అధ్యక్షుడు చందు జనార్ధన్ తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజరేఉ్వషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కాని ఇంత వరకు అది అమలుకు నోచుకోలేదన్నారు.
రిజర్వేషన్లు కల్పించి బీసీలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేవలం అధిష్టానం కేవలం ప్రభుత్వ విప్ అప్పగించి చేతులు దులుపుకుందని, ఎమ్మెల్యే టికెట్లలో సైతం సరైన ప్రాధాన్యతనివ్వలేదన్నారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ మేయర్, మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన బొంతు రామ్మోహన్‌కు కేటా యించాలన్నారు. బీజేపీ అధిష్టానం గతంలో మున్నూరుకాపులను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిదని, గత రెండు పర్యాయాలుగా అగ్రవర్ణాలకు అప్పగిస్తోందని, బీజేపి జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మున్నూరుకాపులకు అవకాశం కల్పించాలన్నారు.
రాబోవు రోజు ల్లో మేమెంతో మాకంత నినాదంతో ముం దుకు సాగుతామని, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్ల వినోద్, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెరుక రమేశ్ పటేల్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆకుల నర్సిం గ్ రావు, జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షుడు సాదనవేని శ్రీకాంత్, నాయకురాలు చీకోటి కవిత, మాలి కరుణాకర్ పటేల్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.