29-09-2025 01:16:06 AM
మేడిపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమిషాంబ దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అమ్మవారిని దర్శించు కొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోడుప్పల్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఏర్పాటుచేసిన అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించి భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బిఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా గెలవాలని, అమ్మవారిని వేడుకు న్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో పిజ్జాదిగూడ, బోడుప్పల్, మాజీ మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి,మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, మాజీ కార్పొరేటర్లు,బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.