14-07-2025 12:00:00 AM
బాన్సువాడ, జూలై 13 (విజయ క్రాంతి), బాన్సువాడలో గుంతలు అనే శీర్షికతో విజయ క్రాంతి దినపత్రిక వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. బాన్స్వాడ పట్టణంలోని ప్రధాన రహదారి గుంతల మయంగా ఉన్న విషయాన్ని విజయ క్రాంతి వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించారు. గుంతలలో మొరం పోయించారు. బాన్స్వాడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గుంతలతో అవస్థలు పడుతున్న విషయాన్ని విజయ క్రాంతి పత్రికల్లో కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టారు.