calender_icon.png 6 January, 2026 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

05-01-2026 12:00:00 AM

మిడ్జిల్ జనవరి 4 : మండలంలోని వెలుగొమ్ముల గ్రామంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం  రథోత్సవం సంద ర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వేడుకలను ఘనంగా  నిర్వహించారు. రథంపై అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా తిరిగి ప్రధాన ఆలయం వరకు తిప్పారు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు మంగళహారతులు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులు గోవింద నామస్మరణలు బ్యాండ్ వాయిద్యం మధ్య లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి. గ్రామ సర్పంచ్ సువర్ణ. గ్రామ పెద్దలు మహేష్ కుమార్, సత్యం గౌడ్, విజయాజి, ప్రేమకుమార్, జంగయ్య, మహిళలు, యువకులు పాల్గొన్నారు.