calender_icon.png 10 September, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్డిఓ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

09-09-2025 11:34:47 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజాకవిగా పేరు పొందిన స్వాతంత్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జయంతిని తూప్రాన్ ఆర్ డి ఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆర్డిఓ జయ చంద్రారెడ్డి(RDO Jaya Chandra Reddy) కాళోజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్.డి.ఓ మాట్లాడుతూ ఆయన తెలంగాణ భాషకు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ప్రసంగించారు. కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారని, వారు తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ భాషలలో కవిత్వం రాశారని వారికి 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారని, వారి జన్మదినన్నే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా గౌరవించిందని తెలియజేశారు. కాళోజీ ఆనాటి ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో, సత్యాగ్రహం, ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేమాతరం, గ్రంథాలయ ఉద్యమాలలో పాల్గొని ఆనాటి నిజాం పాలనలో జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు.