09-09-2025 11:33:09 PM
జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): లీగల్ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి(District Incharge Judge Kalyan Chakravarthy) తెలిపారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారులు రాజీ కుదిర్చుకునే కేసుల్లో ఈ లోక్ అదాలత్ ద్వారా వారి వారి కేసులను పరిష్కరించుకోవచ్చని చెప్పారు, మొత్తం ఎనిమిది బెంచ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కక్షిదారులు న్యాయవాదులు వారి వారి కేసుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించి లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిర్చుకునేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఇప్పటికే 1748 కేసులను గుర్తించి అందులో 525 కేసులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లోక్ అదాల నిర్వహించబడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి ఇందిరా పాల్గొన్నారు.