10-09-2025 12:23:07 AM
నల్లగొండ, సెప్టెంబర్ 09: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్గొండ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లయన్ అధ్యక్షులు రమేష్ పెండ్యాల, సెక్రటరీ వందనపు వెంకటేశ్వర్లు , ట్రెజరర్ వెంకట్రావు పానగంటి,జి.యస్. టి కన్వినర్ విప్లవ్ కుమార్, ప్రధాన అతిథులుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులైన తీగల నాగయ్య, సంజీవయ్య, నూకల జ్యోతి, నామిరెడ్డి మహేందర్ రెడ్డి, పనగంటి వెంకట్రావ్, వట్టే ప్రతాప్ రెడ్డిను సన్మానిస్తూ, వారి సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతగా ఎంపికైన తీగల నాగయ్య మోటివేషనల్ స్పీకర్ & స్కిల్స్ ట్రైనర్ మాట్లాడుతూ.. ఈ అవార్డు నాకు వ్యక్తిగత గౌరవమే కాకుండా, నన్ను తీర్చిదిద్దిన నా తల్లిదండ్రులకి , నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయులకి మరియు నన్ను ప్రోత్సాహిస్తున్న మా అన్నయ్యలకి చెందినదని తెలిపారు. లయన్ మిత్రులు, స్థానిక విద్యావేత్తలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.