09-09-2025 11:54:18 PM
మిడ్జిల్: భారత 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్(CP Radhakrishnan) విజయం పట్ల మంగళవారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, బాణాసంచతో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇన్ రాజేశ్వర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి మండల అధ్యక్షులు నరేష్ నాయక్, పిఎసిఎస్ డైరెక్టర్ భీమయ్య, మండల నాయకులు బుచ్చయ్య, కుమ్మరి రాములు, జంగయ్య, అరవింద్, బిర్లా శేఖర్, బొర్రా రాము, జమ్ముల శేఖర్, పట్నం శివ, వర్కల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.