09-09-2025 11:52:24 PM
యాదాద్రి (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వర్టూరు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య(MLA Beerla Ilaiah) పాల్గొన్నారు. పల్లె నిద్ర కార్యక్రమానికి వట్టూరు గ్రామానికి విచ్చేసిన బీర్ల ఐలయ్యకు గ్రామస్తులు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. మంగళహారతులు ఇచ్చి, డప్పు డోల్ల వాయిద్యాల, కోలాటాల మధ్య స్వాగతం పలికారు. పల్లె నిద్రలో భాగంగా గతంలో కేసీఆర్ పల్లె నిద్ర పేరుతో ఆడెపు యాదమ్మ - యాదయ్య, సుదర్శన్ కుటుంబాన్ని మరిచిపోయి వదిలేసిన ఆ దళిత కుటుంబానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భరోసాగా నిలిచి ఆ కుటుంబ ఇల్లును సందర్శించి ఇందిరమ్మ ఇల్లు ధ్రువపత్రం ఇచ్చారు. దళితవాడలో పల్లెనిద్రలో భాగంగా ఆ కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, అక్కడే బస చేసి ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ధ్రువపత్రాలు పంపిణీ చేసి ముగ్గు పోసి భూమి పూజ చేయనున్నారు.