calender_icon.png 10 September, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి

10-09-2025 12:25:36 AM

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 9 ( విజయక్రాంతి ): హెచ్‌ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమలలో బాగంగా యూత్ ఫెస్ట్ 2025  , 5K రెడ్ రన్  జిల్లా వైద్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం నాడు రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్  మాట్లాడుతూ యువత హెచ్‌ఐవి ఎయిడ్స్ పై పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా సాయి శోభ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ అవగాహన కొరకు ప్రతి సంవత్సరము కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని , క్రమశిక్షణ, మంచి ప్రవర్తన , పెండ్లికి ముందు హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోవాలి  తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులకు గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించారు.

ప్రోగ్రాం ఆఫీసర్ సాయి శోభ,  సంపత్, ముత్యాలు చంద్రమౌళి సతీష్ నరసింహ కళాశాల ప్రిన్సిపల్ కర్ణాకర్ రెడ్డి P Muthyalu , chandramouli, satish, Narsimha, కళాశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి పిడి ప్రసాద్, నవభారత్, జాగృతి కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన క్రీడలో పాల్గొని పురుషుల విభాగంలో ప్రధమ బహుమతి ఇన్ .గోవర్ధన్, రెండవ బహుమతి దేవ, మహిళల విభాగంలో మొదటి బహుమతి డి. శ్వేత, ద్వితీయ బహుమతి శిరీష గెలుపొందడం జరిగింది.