10-09-2025 12:25:27 AM
రామచంద్రపురం, సెప్టెంబర్ 9 :గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా రోజురోజుకూ పెరుగుతున్న డ్రైనేజీ సమస్యలతో ఎస్‌ఎన్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరిం చేందుకు సుమారు రూ.12 లక్షల నిధులు మంజూరు చేయించి అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించామని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు.
ఎస్‌ఎన్ కాలనీలో స్థానిక ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేసిన ఆమె డ్రైనేజీ పనులు పూర్తయ్యాక సీసీ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ కృషి వల్ల సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నందుకు స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హబీబ్ భాయ్, మైనార్టిటీ అధ్యక్షులు హబీబ్ జానీ, పీటర్ పాల్స్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, రాంజీ, సామ్రాట్, కృష్ణ, వివేక్, శ్రీనివాస్, రఫీ, జియ్యారి కుమార్, రమేష్, సుంకు స్వామి, రాజు, రఫీ, షఫి తదితరులు పాల్గొన్నారు.