calender_icon.png 10 September, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ భాషా పరిరక్షణకు కాళోజీ కృషి

10-09-2025 12:00:00 AM

 జయంతి వేడుకల్లో కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్

ఆదిలాబాద్/మంచిర్యాల, సెప్టెంబర్  (విజయక్రాంతి): తెలంగాణ భాష, యాసను పరి రక్షించడంలో కాళోజీ నారాయణరావు తన కవితల ద్వారా ఎంతో కృషి చేశారని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భం గా మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్ట రేట్ ఉద్యోగులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాళోజీ నారాయణ రావు చిత్రాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  కాళో జీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం భాషా దినోత్సవంగా నిర్వహించి ఆయన్ని గౌరవించడం జరుగుతుందన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు సాహిత్య రంగానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియా డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, పలువురు  జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని కాళోజీ

తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజలందరికీ చిరస్మరణీయులని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు హాజరై కాలోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడిగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా జీవించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.