calender_icon.png 4 October, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీరిన పాతబస్తీ ట్రాఫిక్ కష్టాలు

04-10-2025 01:13:14 AM

-ఫలక్‌నుమా వద్ద నూతన ఆర్‌ఓబీ ప్రారంభం

-రూ.52.03 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి):హైదరాబాద్ పాతబస్తీ వాసులకు తీరని సమస్యగా మారిన ట్రాఫిక్ కష్టాలు నేటితో సమసిపోనున్నాయి. సికింద్రాబాద్ - ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ లైన్‌లోని పాత ఆర్‌ఓబీ సమాంతరంగా నిర్మించిన నూతన రోడ్డు ఓవర్‌బ్రిడ్జిని శుక్రవారం హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

జీహెచ్‌ఎంసీ నిధులు రూ. 52.03 కోట్ల వ్యయంతో ఈ నాలుగు వరుసల ఆర్‌ఓబీని నిర్మించింది. పాత ఆర్‌ఓబీని పునరు ద్ధరించడంతో పాటు, దానికి సమాంతరంగా మరో వంతెన అందుబాటులోకి రావ డంతో ఫలక్‌నుమా ప్రాంతంలో ట్రాఫి క్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. కాగా నూతన ఆర్‌ఓబీ ప్రారం భంతో బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్‌నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి.

ఇప్పటి వరకు తరుచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే గ్లోబల్ స్కూల్ నుంచి బస్ డిపో వరకు కూడా వాహనాలు వేగం గా కదిలే అవకాశం ఏర్పడింది. గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఊరట లభించడం తోపాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.పాతబస్తీలోని చిన్న చిన్న రహదారు ల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతం లో మరో కీలకమైన ఆర్‌ఓబీ అందుబాటులోకి రావడం పట్ల స్థానిక ప్రజలు, వాహ నదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమా ర్ యాదవ్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసుదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, మీర్ జల్ఫికర్ అలీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.