06-12-2025 12:03:22 AM
స్వతంత్రతా సెంటర్ విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో 24/7 మార్కెట్ విధానం అమలు చేయాలని, తెలంగాణలోని టైర్-2 నగరాల్లో వ్యాపారాల పని గంటలను రాత్రి 2 గంటల వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్వతంత్ర తా సెంటర్ అనే పబ్లిక్ పాలసీ థింక్ట్యాంక్ కోరింది. 2024 జూలైలో చేసిన అభ్యర్థనకు కొనసాగింపుగా, ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన జీవో 4 అమలు చేయాలని కోరుతోంది. రిటైల్, సర్వీసులు, ఐటీ, హెల్త్కేర్ రంగాల్లో రాత్రి కార్యకలాపాలు అనుమతిస్తే జీడీపీ పెరుగుదల, ఉద్యోగాల సృష్టి, గ్లోబల్ పోటీ సామర్థ్యం పెరుగుతాయని సెంటర్ పేర్కొంది.
రాఘవేందర్ అస్కాని మాట్లాడుతూ.. 24/7 బిజినెస్ పాలసీ తెలంగాణకు భారీ ఆర్థిక అవకాశాలు తెస్తుందన్నారు. హైదరాబాద్‌లో సంవత్సరానికి రూ.12,549 కోట్లు అదనపు జీడీపి వస్తుంది. 2035 నాటికి 3.54 లక్షల ఉద్యోగాలు ఇవ్వొచ్చు. లండన్, టోక్యో, న్యూయార్క్లతో పోటీ చేసే స్థాయికి ఎదగే అవకాశముంది. టైర్-2 నగరాల్లో రాత్రి 2 వరకు వ్యాపారా లకు అనుమతి పెడితే సంవత్సరానికి రూ.8,500 కోట్లు అదనపు జీడీపీ వస్తుంది.
1.75 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు. ఆర్టీసీ రాత్రి బస్సులు, స్మార్ట్ లైటింగ్, మెరుగైన శుభ్రత అవసరం. మహిళల భద్రత కోసం సీసీటీవీ, యాప్లు, పోలీసు పర్యవేక్షణ అవసరం. టెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నేపథ్యం లో ఈ విధానం పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రానికి మంచి అవకాశం అని సెంటర్ పేర్కొంది.