06-12-2025 12:04:38 AM
స్వాగతించిన క్రెడాయ్ హైదరాబాద్
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గింపును ప్రకటించిన నేపథ్యంలో క్రెడాయ్ హైదరాబాద్ ఈ నిర్ణయాన్ని స్వాగతించిం ది. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్ జైదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. “2025 లో మొత్తం 125 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో పాటు తాజా 25 బీపీఎస్ రెపోరేటు కోత రుణాలను తక్కువ వడ్డీపై అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఆర్బీఐ చేపట్టిన లక్ష కోట్లు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కొనుగోళ్లు బ్యాం కులకు తక్షణ ప్రసారం చేయడానికి కావాల్సిన దిశానిర్దేశం, నిధుల లభ్యతను కూడా అందిస్తాయి. ఇది గృహ కొనుగోలుదారులను తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను తీసుకుని తమ స్వప్న గృహాన్ని కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ విధాన చర్య హైదరాబాద్ మార్కెట్‌కు సరైన సమయంలో వచ్చిం ది. డెవలపర్లు, కొనుగోలుదారులలో నమ్మకాన్ని మరింత బలప రుస్తోంది’ అన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ ఎన్నికైన అధ్యక్షుడు బి జగన్‌నాథ్‌రావు మాట్లాడు తూ.. ‘ద్రవ్య విధానంలో కొనసాగుతున్న రేటు కోతలు గృహ కొనుగోలు దారులకు చారిత్రాత్మకంగా తక్కువ వడ్డీ రేట్ల వద్ద రుణాలను పొందే అరుదైన అవకాశం తెస్తున్నాయి’ అ అన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కాంతి కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తక్కువ వడ్డీ రేట్లు నేరుగా కొనుగోలు శక్తిని పెంచుతాయి. భారం అదే స్థాయిలో ఉండగానే, కొనుగోలుదారులు ఇప్పుడు మరింత ఎక్కువ రుణ మొత్తాలకు అరత పొందగలరు అన్నారు.