06-12-2025 12:04:59 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు శుక్రవారం స్వయంగా రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు.
ఈ మేరకు సీఎం సుఖ్వీందర్‌నును ఆహ్వానించారు. అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ అద్భుతమని సుఖ్వీందర్ కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను దావోస్ సదస్సు తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ర్ట భవిష్యత్ ప్రణాళికలకు కీలక వేదికగా ఇది మారనుంది.