calender_icon.png 23 September, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్టలో కల్లు గీత కార్మికుల మహాసభ

23-09-2025 07:16:27 PM

గీత వృత్తి చేస్తూ సహజ మరణం పొందిన గీత కార్మికుడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేల గీతన్న బీమా పథకాన్ని అమలు చేయాలి

నందనంలో నీరా మరియు తాటి ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలి

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత వృత్తి చేస్తూ సహజ మరణం పొందిన గీతా కార్మికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించే గీతన్న బీమా పథకాన్ని అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం రోజున యాదగిరిగుట్ట పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్ లో జరిగిన కల్లుగీత కార్మిక సంఘం ఆరవ మండల మహాసభ మండల అధ్యక్షులు కోల వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో పాల్గొన్న జయరాములు మాట్లాడుతూ చేతి వృత్తులలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి అని అట్టి వృత్తిని కల్లుగీత కార్మికులు గత్యంతరం లేని పరిస్థితులలో తమ కుటుంబాల పోషణ కోసం చేస్తున్నారని గడిచిన ప్రభుత్వాలు ఎన్ని మారినా గీతన్నల తలరాతలు మాత్రం మారుటలేదని ప్రభుత్వాలకు గీత కార్మికుల సంక్షేమాన్ని వృత్తిని ఆధునికరించాలని చిత్తశుద్ధి లేకపోవడం వల్ల గౌడగీత కార్మిక కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని  భవిష్యత్తులో వారంతా అమరుల స్ఫూర్తితో చైతన్యమై ప్రభుత్వాలు మెడల్వంచే ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నదని అందుకు కల్లు గీత కార్మిక సోదరులంతా పెద్ద ఎత్తున కదలాలని పిలుపునిచ్చారు.

ఈ మహసభలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రాగీర్ కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లాలో వృత్తి చేస్తున్న గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచనాలు అందించాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న గీత కార్మికులకు ఇవ్వవలసిన ఎక్సగ్రేషియాలకు నిధులు విడుదల చేసి బాధితులకు అందించాలని, ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి కేటాయిస్తూ నీటి వసతి కల్పించాలని, వృద్ధాప్య పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి గీత కార్మికునికి మోటార్ సైకిల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహసభలో సంఘం రాష్ట్ర  కమిటీ సభ్యులు దూపటి వెంకటేష్, ఎరుకల సుధా హేమేందర్ గౌడ్. మారగోని శ్రీరామ్మూర్తి గౌడ్. జిల్లా నాయకులు గంధమల్ల ఉపేందర్ గౌడ్. సీస కృష్ణ గౌడ్. గొట్టిపర్తి బాలరాజు గౌడ్. సంఘం నాయకులు మిట్ట వెంకటయ్య గౌడ్ సుదగాని శ్రీనివాస్ గౌడ్ బత్తిని ముత్యాలు గౌడ్ కారింగుల కృష్ణయ్యా గౌడ్. కోరుకొప్పుల కృష్ణస్వామి గాజుల రఘుపతి. బండపల్లి చిన్నస్వామి. కానుగు భరత్ మాటూరి బాలయ్య బుడిగే సత్తయ్య నీల కిష్టయ్య ఆరె రాజు సుడగాని నగేష్. కోల మల్లేష్ పుట్టపోశెట్టి ఆరె పరమేశు దూసరి వెంకటేష్ మాటూరు యాదగిరి గడ్డమీది సాయిలు గడ్డమీది మధు బబ్బురి శ్రీను మాటురి నరసింహ మిట్ట వీరేశం గాజుల శివయ్య శిఖ వెంకటయ్య దూసెట్టి బాలరాజు కోల మైసయ్య బందారపు మల్లేశా దూసరి గణేష్ దుద్ధుర్ రాజు తదితరులు పాల్గొన్నారు.