23-09-2025 07:18:24 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 25న నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సిఐటియు) జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని వివిధ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులను కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఐదు నెలల బిల్లులు, 9 నెలల గుడ్ల బిల్లులు, వేతనాలు వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న కార్మికులను మరోవైపు అమ్మ ఆదర్శ కమిటీలు, ఉపాధ్యాయులు కొత్త మెనూ పేరుతో ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఒంటెపాక వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, కార్మికులు వంటపాక సైదమ్మ, వంటిపాక లక్ష్మమ్మ, వసంత, సురేందర్ పాల్గొన్నారు.