calender_icon.png 23 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ ఉచ్చులో పడకండి... పోలీస్ అవగాహన సదస్సు: సీఐ ధనుంజయ్ గౌడ్

23-09-2025 07:16:11 PM

ఉప్పల్,(విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ సూచించారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ మై ఫ్లోర్ గ్రాండ్ అపార్ట్మెంట్లో నేరాలపై అవగాహన సమావేశ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్స్పెక్టర్ అపార్ట్మెంట్ నివసించే ప్రజలకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్లు మాయమాటలతో కోట్లు కొల్లగొడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.  అపార్ట్మెంట్లోనిప్రతి ఒక్క ఫ్లాట్లో సీసీ కెమెరా ఉండేలా చూసుకోవాలన్నారు.

అపరిచిత వ్యక్తులు నుండి వచ్చే ఫోన్ కాల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లకు రిప్లై సమాధానం ఇవ్వకూడదని ఆయన సూచించారు. సైబర్ కేటుగాళ్లు ఎక్కువ వృద్ధులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్లు వృద్దులు ఉంటే వారికి సైబర్ నేరాల గురించి అవగాహన పెంచాలని ఆయన కోరారు. యువత మత్తు పదార్థలకు దూరంగా ఉండాలని ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు దూరంగా ఉండి రేపటి తరానికి ఆదర్శంగా ఉండాలని యువతకు సూచించారు. అపార్ట్మెంట్లోకి డ్రగ్సు మత్తు పదార్థాలు తదితర ప్రవేశించకుండా అపార్ట్మెంట్ వాసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

చైన్ స్నాచింగ్ ల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని హితో పలికారు. చరవాణిలో వస్తున్న పండుగ నేపథ్యంలో కొంతమంది ఆఫర్ల పేరిట మోసాలకు పాల్పడతారని అలాంటి కాల్స్ పట్ల తగు జాగ్రత్త తీసుకోవాలని లేనియెడల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నగదు పోయే ప్రమాదం ఉంటదని ఎవరి కూడా చరవాణి కొచ్చే ఓటిపిలు షేర్ చేయకూడదన్నారు. దసరా నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వాలని  కోరారు. నేర రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇన్స్పెక్టర్ కోరారు.