calender_icon.png 10 October, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్డీఆర్ కు నివాళులర్పించిన జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు

09-10-2025 09:59:09 PM

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, వరూధినీ దేవి చిత్రపటాలకు తుంగతుర్తిలోని ఆయన స్వగృహంలో సూర్యాపేట జిల్లా టీపీసీసీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా టీపీసీసీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రామడుగు నవీన్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న జన హృదయనేత, టైగర్ దామన్నగా పిలుచుకునే నాయకుడు మరణించడం బాధాకరమని అన్నారు.

అనంతరం దామన్న కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని పరామర్శించి ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్  కొలిపాక సాయికుమార్, జాజిరెడ్డిగూడెం, శాలిగౌరారం, నూతనకల్, తుంగతుర్తి, మోత్కూర్, మద్దిరాల మండలాల టీపీసీసీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు గంట జయంత్, అన్నేబోయిన అనిల్ కుమార్, బోల్కా సైదులు, చింతకుంట్ల హరీష్, బందెల రవి, పోలోజు శేఖర్, మల్లం సతీష్ తదితరులు ఉన్నారు.