calender_icon.png 22 July, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంతార చాప్టర్ 1 మూడేళ్ల ప్రయాణం

22-07-2025 12:27:40 AM

రాజకుమార, కేజీఎఫ్, సలార్, కాంతార వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హోంబాలే ఫిల్మ్స్ చిత్ర నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ‘కాంతార చాప్టర్1’ను రూపొందిస్తోంది.  ఈ చిత్రానికి రిషబ్ శెట్టి  ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌తో మంచి స్పంద నను పొందింది.

తాజాగా నిర్మాతలు ఈ సినిమాకు సం బంధించి అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటిం గ్ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘కాంతార జర్నీ’ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో ‘ఇది సినిమా మాత్రమే కాదు.. ఒక శక్తి’ అంటూ కథానాయకుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి మేకింగ్ విశేషాలను పంచుకున్నారు.

దాదాపు 250 రోజుల షూటింగ్, మూడేళ్ల శ్రమను చూపిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ఈ చిత్రానికి బీ అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తుండగా, అరవింద్ కాశ్యప్ డీవోపీగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుందీ చిత్రం.