calender_icon.png 17 August, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్‌సైన్స్ లాంగ్వేజ్‌లో జాతీయ గీతం ఆలపించిన కరీంనగర్ కలెక్టర్

16-08-2025 12:51:11 AM

కరీంనగర్, ఆగస్ట్టు15 (విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బధిర విద్యార్థులతో కలిసి ఇండియన్ సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాన్ని ఆలపించారు.

దివ్యాంగుల సమస్యల్ని, భావాన్ని అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కరీంనగర్ జిల్లాలోని అధికారులకు ఇండియన్ సైన్ లాంగ్వేజీ బేసిక్స్ పై కలెక్టర్ పమేలా సత్పతి శిక్షణ ఇప్పించారు.

ఏడు రోజులపాటు ఇచ్చిన ఈ శిక్షణ లో అధికారులు సైన్ లాంగ్వేజిలో బేసిక్స్ నేర్చుకున్నారు.ఇందులో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు, బధిరులు ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి సైన్ లాంగ్వేజి లో జాతీయగీతం ఆలపించారు.