calender_icon.png 17 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్వాక్రా మహిళల ఆందోళనకు చెక్ పడేనా?

16-08-2025 12:52:21 AM

- ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా

- బాధ్యులపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలి 

- డ్వాక్రా మహిళలు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 15: ఫోర్జరీ సంతకాలతో స్వయం సహాయక సంఘాల్లో నిధు ల స్వాహాపై జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఆందోళన మరింత పెరుగుతోంది. వివరాల్లోకి వెళితేనే.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, చౌదర్పల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అందాల్సిన సుమారు రూ.2 కోట్లకు పైగా నిధుల ను ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాహా చేయడంతో ఆ గ్రామ మహిళలు ఆందోళన మరింత పెరుగుతోంది. 

అయితే స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఐకేపీ అధికారుల నుంచి మైక్రో క్రెడిట్ ప్లాన్ రికార్డులు అందిన తర్వాతే మంజూరు చేయాలి. కానీ యాచారం ఎస్బీఐలో మాత్రం వీబీకే వరలక్ష్మి, నాటి మేనేజర్ కుమ్మక్కై ఎంసీపీ లే కుండానే నకిలీ డాక్యుమెట్లు, ఫోర్జరీ సంతకాల రికార్డులు సృష్టించి నిధుల స్వాహాకు పాల్పడడంతో బ్యాంకు సేవలను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు.

అప్పంతా కట్టేసినా.. బ్యాంకు నోటీసు

ప్రతినెలా బ్యాంకుకు వెళ్లి డబ్బులు చెల్లిం చి తాము తీసుకున్న అప్పును మొత్తం కట్టేసినా ఇంకా తీరలేదని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారని మహిళలు వాపోయారు. తాము చెల్లించిన స్లిప్పులపై స్టాంపు వెయ్యలేదని, బుక్ కీపర్ తోపాటు గతంలో ఇక్కడ పని చేసిన బ్యాంకు మేనేజర్ కలిసే నిధులను స్వాహా చేశారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

తీగ లాగితే.. డొంక కదిలేనా

చౌదర్పల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘంలో నిధుల స్వాహా అంశం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లాలోని గ్రామాల్లో సైతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే చాలావరకు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ముఖ్య సూత్రధారులు ఎవరున్నారు, నడిపిస్తున్నారు అనేదానిపై తీగ లాగితే డొంక కదులుతుందనీ ప్రజల్లో జోరుగా చర్చలుజరుగుతుంది.