16-08-2025 12:50:30 AM
తుర్కయంజాల్, ఆగస్టు 15:గత ఏడాది 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులకు నగదు అందజేశారు.
టెన్త్లో మొదటి స్థానంలో నిలిచిన కరాడి దీపికకు రూ.10వేలు, కానుగుల హాసిని, కాడ్లే అభిజిత్ కు రూ.5వేల నగదు ప్రోత్సాహకాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, లయన్స్ క్లబ్ ప్రతినిధి సామ భీంరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం సామ భీంరెడ్డి మాట్లాడుతూ చిన్నారులు బాగా చదివి ఉన్నతస్థానాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్య, హెచ్ ఎం జ్యోతి తదితరులుపాల్గొన్నారు.