05-11-2025 06:25:28 PM
సామూహిక సత్యనారాయణ వ్రతాలు..
మహా అన్నదానం..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నగర సంకీర్తన, గోపూజ, ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ సోమేశ్వర వైన్స్ గ్రూప్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం, 7 గంటలకు ఆకాశదీప ప్రచురణ కార్యక్రమం నిర్వహించి, భజన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమేశ్వర దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు కొమ్మెర మహాదేవ శర్మ, గ్రామంలోని సోమేశ్వర సేవకులు, భక్తులు పాల్గొన్నారు.