calender_icon.png 5 November, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శ

05-11-2025 06:23:35 PM

అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండల మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి సతీమణి లక్ష్మమమ్మకు ఇటీవల మోకాలి చికిత్స జరిగిన విషయం తెలుసుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం ఆమెను పరామర్శించారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన ఆయన, మనమందరం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేను ముందుండి సహాయం చేస్తానని భరోసా కల్పించారు. పరామర్శ సమయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనతో పాటు ఉన్నారు.