05-11-2025 06:28:37 PM
ప్రచారంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..
మణుగూరు (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సహచర ఎమ్మెల్యేలతో కలిసి బోరుబండ కాలనీ పరిధిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయమే కాంగ్రెస్ బలపతాక ఎగురవేయడానికి కీలకమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజల అభీష్టమే పార్టీ విజయానికి మూలమని, అభ్యర్థి నవీన్ యాదవ్ యువతకు నూతన ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రచార సమయంలో ప్రజలతో పాయం వెంకటేశ్వర్లు సంభాషిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, విద్య–ఉద్యోగ రంగాల పురోగతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నవీన్ యాదవ్ విజయం – ప్రజల విజయం నినాదాలతో హోరెత్తించారు.