calender_icon.png 6 November, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

06-11-2025 12:03:59 AM

- కార్తీక స్థానం శివ పూజ 

- శివాలయంలో దీపోత్సవం 

ఏటూరునాగారం, నవంబర్5 (విజయక్రాంతి):ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బోలా శంకరుడైన ఆ పరమ శివుడు ప్రజలందరికీ సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పార్థిస్తూ మండల ప్రజలు తెల్ల వారుజామున పవిత్ర గోదావరి నదిలో తల స్థానాలు ఆచరించి శివాలయంలో దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి హిందూ ధార్మికంగా చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసం చివరి రోజు ఇది ఈ రోజున శివుడు, విష్ణు వు, కార్తికేయుడు, తులసీదేవి పూజలు విస్తృతంగా నిర్వహించారు అనేక పుణ్యకార్యాలు చేస్తే వాటి ఫలితం అనేక రెట్లు పెరుగుతుందని శాస్త్రాలు చెబుతాయి. కార్తీక పౌర్ణమి రో జున ధార్మిక కార్యక్రమాలు ఉదయం స్నా నం (పవిత్ర స్నానం నది, వాగు లేదా ఇల్లు వద్ద సూర్యోదయానికి ముందు స్నానం ఆచరించారు.

దీన్ని కార్తీక స్నానం అంటారు. స్నానం తర్వాత దీపారాధన చేసి దేవతలను పూజిస్తారు. దీపారాధన దీపములు వెలిగించడం ఇంటి ముందు, దేవాలయంలో, నదీ తీరంలో, వృక్షాల క్రింద దీపాలు వెలిగిoచారు.దీన్ని దీపోత్సవం అని కూడా అంటా రు.ప్రత్యేకంగా శివాలయాలు, విష్ణు ఆలయాలు దీపాలతో అలంకరించబడాయి శివ పూజ / కేశవ పూజ శివలింగానికి అభిషేకం పాలు, నీరు, తేనెతోఓం నమః శివాయ జ పం, విశ్ణు సహస్రనామం, శివ సహస్రనామం పారాయణం తో ఘనంగా అభిషే కాలు నిర్వహించారు తులసీ పూజ & తులసీ వివాహం తులసీదేవి పూజ చేస్తారు.

తులసీ వివాహం విష్ణువుతో లేదా శాలిగ్రామంతో నిర్వహిoచారు ఇది పవిత్ర వివాహోత్సవంగా భావిస్తారు.ఉత్సవాలు & సాంస్కృతి క కార్యక్రమాలు దేవాలయాలలో దీపోత్సవంనుదేవాలయాలను వేలాది దీపాలతో ఘనంగా అలంకరిoచారు భక్తులు హారతులు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వ హిoచారు ఆకాశ దీపాలు (దీపాలు వదలడం పుణ్యక్షేత్రాల్లో,గ్రామాల్లో,నదీ తీరంలో దీపాలు వదలడం జరిగింది.ఆధ్యాత్మిక ప్రా ముఖ్యత శివుడు కార్తికేయుడికి జ్ఞానం ఇచ్చిన రోజుగా, ప్రజలు భావిస్తారు.అలాగే తులసీదేవి శాలిగ్రాముడిని వివాహం చేసుకున్న రోజుగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రసాద్ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి 

వెంకటాపురం(నూగూరు), నవంబర్ 5(విజయ క్రాంతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్దల నడుమ వేడుకలను నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని శివాలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయం మండపంలో దీపారాధన కార్యక్రమాలతో ప్రత్యేక పూజలను భక్తులు జరుపుకున్నారు. ఆలయ అర్చకులు అవసరాల రామశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనేకమంది భక్తులు తెల్లరజామునే గోదావరి స్నానాలను ఆచరించి పవిత్ర కార్తీక మాసంలో గోదావరి నదిలో దీపాలను వదిలారు. అనంతరం దైవదర్శనార్థం శివాలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారు మ్రోగా యి. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వెళ్లారు. అత్యంత భక్తిశ్రద్ధల నడుమ కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు జరుపుకున్నారు భక్తుల రాకతో ఆలయాల్లో సందడి నెలకొన్నది. మరి కొంతమంది భక్తులు కార్తిక పౌర్ణమి సందర్భంగా పుట్టల్లో పాలుపోసి తమ భక్తిని చాటుకున్నారు.