calender_icon.png 6 November, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

06-11-2025 12:17:34 AM

  1. పలువురు నాయకుల పూజలు భక్తులకు అన్న దానం 
  2. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు 

తాడ్వాయి, నవంబర్ 5 (విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని  శబరిమాత ఆశ్రమంలో, బ్రహ్మాజీ వాడి శివారులోని  సిద్దేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుణ్ణి పూజిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని భగవంతుని ప్రార్థించినట్లు  తెలిపారు. శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి సిద్దేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రముఖ సైంటిస్ట్, బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు,భక్తులు పాల్గొన్నారు.

బీబీ పేటలో ..

కామారెడ్డి, నవంబర్ 5 (విజయక్రాంతి):కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో ఘనంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా వేణుగోపాలస్వామి రథయాత్రను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తేత్రాయుగ కాలంలో నిర్మితమైన  వేణుగోపాల స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రథయాత్ర నిర్వహించారు. వేణుగోపాల స్వామి గోవిందా గోవిందా అంటూ భక్తులు జయ జయ నామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు వివిధ కులాల సంఘ పెద్ద మనసులు, గ్రామ గ్రామ ప్రముఖులు వివిధ కులాల సంఘ పెద్ద మనసులు, గ్రామ ప్రజలు అందరు పాల్గొని అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు.

గ్రామ ప్రజలు అందరు పాల్గొని అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. వేణుగోపాల స్వామి గోవింద గోవింద అంటూ గ్రామస్తులు ఆటపాటలతో పటాకుల సంబరాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి, నవంబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి  వేడుకలను జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం, సంకష్టహర గణపతి ఆలయం, శ్రీరామ్నగర్ కాలనీ భక్త ఆంజనేయ ఆలయం, సాయిబాబా ఆలయం, రామేశ్వర్ పల్లి శివారులోని సద్గురు సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు.

గాంధీనగర్ కాలనీలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయమే తలంటూ స్నానాలు ఆచరించిన మహిళలు ఇండ్లలోని తులసి మొక్కలకు ఆలయాల వద్ద గల తులసి మొక్కలకు, ప్రత్యేక పూజలు నిర్వహించారు, దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

భిక్కనూరు సిద్దరామేశ్వరా లయం ఆలయం, చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయం, రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం, మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఈశ్వర ఆలయం, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ని శివకేశవ ఆలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు,ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జుక్కల్ నియోజకవర్గంలో..

బిచ్కుంద, నవంబర్ 5 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, పెద్ద కొడఫ్గల్ మండలాల్లో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా మహిళలు తులసి కోటకు రాధాకృష్ణ చిత్రపటాలతో పూజలు నిర్వహించారు. ఉసిరి దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బాణాసంచాలు కాలుస్తూ భక్తులు పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు.