calender_icon.png 6 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

06-11-2025 01:13:37 AM

  1. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాశక్తి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

కన్నుల పండుగగా సత్యనారాయణ స్వామి వ్రతం

కరీంనగర్, నవంబరు 5 (విజయ క్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాల యానికి భక్తులు పోటెత్తారు. దేవాలయంలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన మండపంలో సామూహికంగా శ్రీ రమా సత్యనా రాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా నిర్వహించారు. దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఆలయ అ ర్చకులు వ్రతంలో పాల్గొన్న దంపతులకు స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులు తులసి చెట్టు వద్ద వివిధ దేవతా వృక్షాల వద్ద కార్తీకదీపం వెలిగించి మొక్కలు చెల్లించారు. భక్తులు దే వాలయంలో దీప దానాలనుఅందించారు.

లక్ష దీపోత్సవం ప్రారంభించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,నవంబర్ 05(విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల వాడ రాజరాజేశ్వర స్వామి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా ఈ సందర్భంగా వేములవాడ భీమే శ్వర ఆలయం, భీమేశ్వర సదన్ లో సామూహిక లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించ గా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కా ర్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ రాధాబాయి, అర్చకులు తదితరులుపాల్గొన్నారు.

మంథని లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు 

మంథని, నవంబర్ (విజయ క్రాంతి)మంథని పట్టణంలోని తమ్మి చెరువుకట్ట వీధిలో గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం లో కార్తీక పౌర్ణమి పుణ్య తిథిని పురస్కరించుకొని బుధవారం ఉదయం ఉదయం 6 గంటలకు లోక కళ్యాణార్థం మన ఇంటి హార తి కార్యక్రమములో భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఆడపడుచులు తమ ఇంటి నుండి మంగళహారతి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు.

ఉదయం 6 నుండి 6-30 వరకు సామూహికంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆలయ అర్చకులు రామడుగు సా యి శ్రీనివాస్ 45 నిమిషముల పాటు శేజ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హారతి కార్యక్రమం అనంతరం ఎవరి ఇంటికి వారు వేళ్ళాలని ఆయన అన్నారు. బాబా ఆలయంలో హారతి కార్యక్రమంలో పాల్గొంటే బాబా సంపూర్ణ కృపకు పాత్రులు అవుతారని ఆయన పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి రో జున ఆలయాల్లో దీపాలు వెలిగించడం మన సాంప్రదాయమని ఈ హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

శైవ క్షేత్రాలలో కార్తీక శోభ 

జగిత్యాల అర్బన్, నవంబర్ 5 (విజయ క్రాంతి): కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయం, గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం, బ్రాహ్మణ వీధి హరిహర ఆలయం, విశ్వేశ్వరాలయం, శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయం, మడేలేశ్వర స్వామి దేవాలయాలలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వ హించారు.

ఈ సందర్భంగా కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష సంఖ్యలో బుధవారం ఉదయాత్ పూర్వం నుంచే భక్తులు, మహిళలు కుటుంబ సమేతంగా ఆలయంలోని స్వామి అమ్మవార్లను ద ర్శించుకొని మహాదేవునికి బిల్వపత్రాలు సమర్పించి, బ్రాహ్మణోత్తములకు దీప దానాలు, కూష్మాండ ధానాలు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు, సత్సంగ్ సభ్యులు పాల్గొని స్వామివార్ల నామస్మరణలు, భజనలతో అలరించారు.

అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేసి ఆశీర్వాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో.ఎస్. సురేందర్, చైర్మన్ బాసె ట్టి లవకుమార్, ఫౌండర్స్ గౌరిశెట్టి రా మ్మూర్తి దేశాయ్ సహోదరులు, మంచాల రాంగోపాల్, గౌరిశెట్టి రాజు, అర్చకులు రు ద్రంగి గోపాలకృష్ణ శర్మ, అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ, శశాంక శర్మ,, భార్గవ శర్మ, ఆలయ సత్సంగ్ సభ్యులు, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.