calender_icon.png 7 June, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక కాటమయ్య పండుగ

02-06-2025 12:52:36 AM

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చండూరు, ( గట్టుప్పల) జూన్ 1( విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక కాటమయ్య బోనాల పండుగని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో కాటమయ్య బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాటమయ్య పండుగ అనేది మన సంప్రదాయాలకు ప్రతిరూపమని, కాటమయ్య దేవునికి బోనమును సమర్పించడం నా జీవితంలో ఓ మహాధ్యాగం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకమై పండుగలో భాగస్వాములమవుతూ గ్రామీణ సంప్రదాయాలకు ఎంతో గౌరవం అని ఆయన అన్నారు. అనంతరం ఈ పండుగలో ఊరేగింపు, సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతోగాను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, చండూరు మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటరమణగౌడ్, మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, బి ఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇడెం కైలాసం, సుర్వి యాదయ్య, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.