06-11-2025 08:05:33 PM
నకిరేకల్ (విజయక్రాంతి): శాలిగౌరారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్ కుమార్ గురువారం సందర్శించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై 7 రోజుల శిక్షణలో భాగంగా మండలానికి వచ్చిన ఆయనకు తహసీల్దార్ బి. వరప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ కార్యకలాపాలు, పలు రికార్డుల నిర్వహణపై పవన్ కుమార్‌కు తహసీల్దార్ తెలియజేశారు. అనంతరం సిబ్బంది ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.