03-09-2025 02:49:31 PM
రామచంద్రపురం (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్‌లో శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను 26 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు బిజెపి డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్(BJP Division President Narsing Goud) తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా స్థానికుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్దఎత్తున పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ, ఉత్సవాలను కాలనీవాసుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ నెల 6న 9వ రోజు వివిధ కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలతో గణనాథుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలకు గత 26 సంవత్సరాలుగా సహకరిస్తున్న కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.