03-09-2025 03:01:35 PM
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా(Kavitha Resigns) చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. నేను కవిత వెనుకున్నాను అని ఒకరంటున్నారు.. హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానని మరొకరు అంటున్నారు. నేను ఎవరి వెనుకాల లేనని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రజలు వాళ్లను తిరస్కరించారని చెప్పారు.
ప్రజలు తిరస్కరించిన వారి వెనక నేనుందుకు ఉంటాను?.. నేను ప్రజల వెంట మాత్రమే ఉంటానని చెప్పారు. అంత చెత్త మనుషుల వెనుక నేనెందుకుంటా అన్నారు. దిక్కుమాలినోళ్ల వెనుక.. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఉంటారా? ఇంత పనికిమాలినోళ్లతో కలిసే సమయం తనకు లేదని చెప్పారు. మీ కుల, కుటుంబ పంచాయితీల మధ్య మిమ్మల్ని తీసుకురావద్దని సీఎం హెచ్చరించారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చి విభేదాలు రావడంతోనే కవితను పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పారు. మీరు కాలం చెల్లిన వెయ్యి నోటు వంటివారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు ఎలా మనుగడ సాధిస్తారు? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.