calender_icon.png 5 September, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచారం సరికాదు

03-09-2025 02:33:16 PM

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కురుపాటి గణేష్..

చండూరు (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై మొదటిగా మాట్లాడింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komatireddy Raj Gopal Reddy) అని, అలాంటి వ్యక్తి ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని మాట్లాడినట్లు తప్పుడు వార్తను సృష్టించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని‌ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు-ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్ అన్నారు. బుధవారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల కోసం కాకుండా కమీషన్ల కోసమే బీఆర్ఎస్ నాయకులు నిర్మించారని అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారని అన్నారు.

సోషల్ మీడియాలో రాజ్ గోపాల్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. తప్పుడు వార్తలను ఖండిస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారమంతా బీఆర్ఎస్ పనే అని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే వారికి బుద్ధి చెప్పడానికి తన పదవిని వదిలేసిన చరిత్ర రాజ్ గోపాల్ రెడ్డి దన్నారు. కాగా రాజ్ గోపాల్ రెడ్డిపై తప్పుడు వార్తలు సృష్టించి ప్రముఖ పత్రికల పేర్లతో విడుదల చేస్తున్నారని.. వాటిని నమ్మవద్దని ఆయన అన్నారు.