calender_icon.png 3 November, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి

05-05-2024 12:30:19 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి, మే 4 (విజయక్రాంతి): వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. శనివారం చిట్యాల మండలం గోపాలపురంలో ఆయన ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.