03-11-2025 06:58:16 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామంలో రూ.28 లక్షల SDF నిధులతో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా జరిగిన పూజ, యజ్ఞం కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. సరస్వతి ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి- ప్రేమల దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, బాన్సువాడ గ్రామీణ, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.