19-06-2025 12:46:57 AM
- ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్యకు మాజీ సీఎం
- ప్రభుత్వ వైఫల్యాలు వివరించేందుకు కార్యాచరణ
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్నాయనే సంకేతాలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నా రు. దీనిలో భాగంగానే త్వరలో పార్టీ లో ముఖ్యనేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తుందని ప్రజలకు వివరించేందుకు సన్నాహాలు చేసుకుంటు న్నట్లు తెలిసింది. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్ట్‌ల పెం డింగ్‌ను ప్రభుత్వ వైఫల్యంగా ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నట్లు, ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేయాలని కేసీఆర్ యోచిస్తున్న ట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పాలమూరు ఎత్తిపోతల పను లు బీఆర్‌ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే, మిగిలిన పనులు పక్కన పెట్టిందని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించేలా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని బోగట్టా. మేడిగడ్డ పరిధిలో రెండు పిల్లర్లు కుంగాయన్న సాకుతో ఆయకట్టును ఎండబెడుతున్నారని, రాష్ట్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని గులాబీ శ్రేణులు ప్రచారం చేసేలా ఉద్బోధ చేస్తారని విశ్వసనీయ సమాచారం.