15-07-2025 10:16:24 PM
సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి
మణుగూరు,(విజయక్రాంతి): మండలం లోని మారుమూల ఆదివాసి గ్రామాలైన ఖమ్మంతోగు, బుగ్గ, బుడుగుల, పెద్దిపల్లి, ఇప్పల గుంపు గ్రామా లకు చెందిన గుత్తి కోయ ప్రజల కు, పిల్లలకు, ఆధార్ కార్డులను అధికారులు వెంటనే అందించాలని, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి కోరారు. మంగళవారం ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లో అధికంగా నిరక్షరాస్యు లు ఉన్నారని, దీంతో వారు ఎలా దరఖాస్తు చేసయక నేటి వరకు ఆధార్ కార్డులను ప్రజలు పొందలే దన్నారు. ప్రభుత్వ పథకాలకు కూడా ఇప్పటి వరకు వారు దూరమయ్యరని గుర్తు చేశారు. కలెక్టర్ స్పందించి ఆదివాసి గ్రామాలలో ప్రత్యేక ఆధార్ క్యాంప్ ను ఏర్పాటు చేసి ఆధార్ కార్డులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.