calender_icon.png 16 July, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ వసతి గృహంకు దూరంగా ఉండేలా మార్చురీ భవనాన్ని నిర్మించాలి

15-07-2025 10:19:14 PM

ఆర్ఎంఓకు వినతి పత్రాన్ని అందజేసిన బిజెపి నాయకులు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా మార్చురీ గదిని బాలికల ఆశ్రమ వసతి గృహం కు దూరంగా ఉండేలా నిర్మించాలని కోరుతూ మంగళవారం ఆస్పత్రి ఆర్ఎంవో సుజాతకు బిజెపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చురీ గది వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికావడమే కాకుండా భయాందోళనకు గురయ్యారని, నూతనంగా నిర్మిస్తున్న మార్చురీ గదిని వేరే చోటకు మార్చి నిర్మించాలని కోరారు. మార్చురీ గదిని మార్చని యెడల విద్యార్థులచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.