calender_icon.png 25 August, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల మళ్లింపుపై నిఘా

25-08-2025 02:14:46 AM

కాంగ్రెస్ వ్యూహాన్ని బద్దలు కొట్టేందుకు ఎన్డీయే పావులు

  1. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే, ఇండియా కూటమి సిద్ధం
  2. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నిధుల సమీకరణ?
  3. బీహార్‌కు తరలింపునకు సన్నాహాలు.. ఐటీ, ఈడీ సంస్థల నజర్
  4. కాంట్రాక్టర్లు, రియల్టర్లు, కంపెనీల అధినేతలపై ఫోకస్

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): బీహార్ శాసనసభ ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే మిగి లి ఉండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ ఎన్నికలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి యా కూటమి అక్కడ హోరాహోరీ పోరు కు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇప్పటికే రంగంలోకి దిగి అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డా రు.

బీహార్ ఎన్నికల్లో గెలుపు ఇరు పార్టీలకూ జీవన్మరణ సమస్యగా పరిణమిం చింది. అయితే, ఈ రాజకీయ సమరం వెనుక పెద్ద ఆర్థిక యుద్ధమే దాగి ఉన్నట్లు దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థ ల యాజమాన్యాల నుంచి ఆ పార్టీ నిధు లు సమీకరించి, బీహార్‌కు తరలిస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నిధుల మళ్లింపుపై దృష్టి సారించినట్లు వార్తలు వినవస్తున్నాయి.

దీనిలో భాగంగానే ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ), ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలతో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలపై నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సమకూర్చుకున్న నిధులను బీహార్ తరలించకుండా, అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ సంస్థలు పనిచేస్తున్నట్లు కొన్ని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తే కాంగ్రెస్ ఆర్థిక మూలాలను దెబ్బతీసి బీజేపీ బీహార్‌లో పాగా వేయాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది. 

పక్కాగా బీజేపీ వ్యూహం..

బీజేపీ జాతీయ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే నవంబర్‌లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజ యం సాధించడం ముఖ్యం. ఇక్కడ ఆ పార్టీకి ఓటమి ఎదురైతే, ఆ ఓటమి జాతీయ స్థాయి లో ప్రతిపక్షాలకు కొత్త ఊపిరి పోస్తుంది. మరోవైపు, ఉత్తరాదిలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు బీహార్ ఫలితాలు ముఖ్యమైనవి. ఇక్కడ పైచే యి సాధిస్తేనే పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

తద్వారా దేశవ్యాప్తంగా పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసే దిశగా పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతున్నది. దీనిలో భాగంగానే ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా నిధు లను సమీకరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎన్నికలు దగ్గర పడే సమయంలో నిధుల తరలింపునకు పూనుకుంటే, కేంద్ర సంస్థల దృష్టిలో పడే ప్రమాదం ఉన్నందున.. ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సెప్టెంబ ర్ లేదా అక్టోబర్ నెలల్లోనే నిధులు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

నిఘా నీడలో కాంట్రాక్టర్లు, వ్యాపారులు..

కాంగ్రెస్ ఆర్థిక వ్యూహాన్ని బీజేపీ ముందుగానే పసిగట్టినట్టు కనిపిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్‌కం ట్యాక్స్(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) సంస్థలు ఏడాది నుంచి తెలంగాణ, కర్ణాటకల్లోని కాం గ్రెస్ పార్టీకి అనుకూలగా నడచుకుంటున్న కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కంపెనీ అధినేతలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అనుకూల విధానాల ద్వారా లబ్ధి పొంది, చట్టవిరుద్ధంగా లాభాలు ఆర్జిస్తున్నారనే అనుమా నంతో వీరిపై నిఘా కన్నువేశాయి.

ఈ వ్యక్తుల నుంచి బీహార్‌లోని కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు చేరకుండా నిరోధించడమే దర్యాప్తు సంస్థల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. మనీ లాండరింగ్, విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలను ఈడీ దర్యాప్తు చేస్తుండగా, ఐటీశాఖ పన్ను ఎగవేతలపై దృష్టి సారిస్తున్నది.

గతంలోనూ ఈ రెండు సంస్థలు పరస్పరం సహ కరించుకుని, అనేక హై ప్రొఫైల్ కేసులను ఛేదించిన సంగతి తెలిసిం దే. ఇటీవల ఐటీ శాఖ గుర్తించిన రూ. 263 కోట్ల పన్ను వాపస్ మోసం కేసు ను ఈడీకి బదిలీ చేయడమే అందుకు నిదర్శ నం. ఈ సమన్వయం ద్వారా ఆర్థిక అవకతవకలపై వేగంగా చర్యలు తీసుకోవడానికి ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతున్నది.

రాజకీయ ఆయుధంగా దర్యాప్తులు?

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు బీజే పీ ఆయుధాలుగా వాడుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ము ఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై ఆ తరహా ఆరోపణలు బలంగా ఉన్నాయి. 2014 నుంచి 2024 మధ్య ఈడీ నమోదు చేసిన 5,297 కేసుల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేవలం 40 కేసుల్లో మాత్రమే శిక్షలు ఖరారు కావడం ఆ ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నది.

రాష్ట్రాల పరిధిలోని కేసుల్లోనూ ఈడీ జోక్యం చేసుకోవడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. సహకార సమా ఖ్య స్ఫూర్తిని గౌరవించాలని సర్వోన్నత న్యా యస్థానం కేంద్రానికి చురకలు సైతం అంటించింది. 2021లో నాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసాలపై ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు నిర్వహించడం కూడా రాజకీ య లక్ష్యంతో జరిగిందేనన్న ఆరోపణలున్నా యి. ఇప్పుడు కూడా, బీహార్‌కు నిధులు వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగానే తెలం గాణ, కర్ణాటకలోని వ్యాపారులపై కేంద్ర నిఘా సంస్థలు నిఘా పెంచాయనే అభిప్రా యం రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతున్నది.

కాంగ్రెస్‌కు కత్తి మీద సాము

ప్రస్తుత పరిస్థితుల్లో, కేంద్ర దర్యా ప్తు సంస్థల నిఘా వలయాన్ని ఛేదించుకుని బీహార్ ఎన్నికలకు నిధులు సమ కూర్చుకోవడం కాంగ్రెస్‌కి కత్తి మీద సాము లాంటిదే. కాంగ్రెస్ అధికారంలోఉన్న తెలంగాణ, కర్ణాటకలనే ఆర్థికం గా నమ్ముకోవడం, ఈ రెండు రాష్ట్రాల ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఐటీ, ఈడీల దూకుడుతో కాంగ్రెస్ పార్టీ నిధుల బదిలీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి రావొచ్చు. ఇలాంటి ఎత్తుగడలు మున్ముందు పార్టీని మరిన్ని చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టే ప్రమాదమూ లేకపోలేదు.