14-10-2025 12:42:10 AM
విండీస్ పోరాటంతో గెలుపు ఆలస్యం
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్‌ను 2 స్వీప్ చేసేందుకు భారత్ చేరువైంది. విండీస్ పోరాటంతో భారత్ విజ యం ఐదోరోజుకు వాయిదా పడిందే తప్ప ఫలితం మాత్రం ఊహించిందే.. అయితే నాలుగోరోజు విండీస్ మాత్రం అసాధరణ రీతిలో పోరాడిందనడంలో ఎలాంటి సందే హం లేదు. కాంప్‌బెల్,హోప్ సెంచరీలతో జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించా రు. వీరిద్దరి పోరాటంతో పాటు చివర్లో గ్రీవ్స్ హాఫ్ సెంచరీతో భారత్ ముందు వంద కంటే ఎక్కువ టార్గెట్ ఉంచగలిగింది. చివరిరోజు విజయం కోసం 58 పరుగులే చేయాల్సిన నేపథ్యంలో టీమిండియా గెలుపు లాంఛనమే.
ఓవర్‌నైట్ స్కోర్ 173/2 పరుగులతో నాలుగోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ నిలకడగా ఆడింది. అనవసరపు షాట్లకు పోకుండా కాంప్‌బెల్,హోప్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఫలితంగా తొలి సెషన్‌లో 73 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. కాంప్‌బెల్(115) జడేజా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇదే తొలి టెస్ట్ శతకం. టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీ చేసేందుకు అత్యధిక ఇన్నింగ్స్‌లు(50) ఆడిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
తర్వాత రెండో సెషన్‌లో మాత్రం భారత బౌలర్లు పుంజుకున్నారు. హోప్(103) సెంచరీ చేసిన వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో ఔటవగా... ఛేజ్(40), టెవిన్(12),ఫియరీ(0)లను కుల్దీప్ వెంటవెంటనే ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందనిపించింది.
ఈ దశలో గ్రీవ్స్, సీల్స్ క్రీజులో పాతుకుపోయారు. ఆచితూచి ఆడుతూ భారత బౌలర్లకు విసుగు తెప్పించారు. ఈ క్రమంలో గ్రీవ్స్(50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గ్రీవ్స్,సీల్స్ 10వ వికెట్‌కు 79 పరుగులు జోడించడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 390 దగ్గర ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా 3/44,కుల్దీప్ 3/104,సిరాజ్ 2/43 రాణించారు.
121 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ త్వరగానే జైస్వాల్(8) వికెట్ కోల్పోయింది. అయితే సాయిసుదర్శన్(30), కేఎల్ రాహుల్(30) నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా నాలురోరోజును ముగించారు. నాలుగోరోజు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.గెలుపు కోసం మరో 58 రన్స్ చేయాల్సిన భారత్ చివరిరోజు తొలి సెషన్‌లోనే మ్యాచ్ గెలవడం లాంఛనమే. దీంతో సిరీస్‌ను 2 కైవసం చేసుకోనుంది.
స్కోరు ్ల : భారత్ తొలి ఇన్నింగ్స్ : 518/5 డిక్లేర్డ్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : 248 ఆలౌట్ వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ : 390 ఆలౌట్ (కాంప్‌బెల్ 115, హోప్ 103,గ్రీవ్స్ 50; బుమ్రా 3/44,కుల్దీప్ 3/104,సిరాజ్ 2/43)
భారత్ రెండో ఇన్నింగ్స్ : 63/1(టార్గెట్ 121)