calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ పీఠం ఎవరిదో?

14-10-2025 12:00:00 AM

-కరీంనగర్ కు చేరుకున్న ఏఐసీసీ ప్రతినిధులు

-నేటినుండి నియోజకవర్గాల వారీగా అభిప్రాయం సేకరణ

కరీంనగర్, అక్టోబర్13(విజయక్రాంతి): కరీంనగర్ డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది. ఏఐసీసీ ప్రతినిధి  శ్రీనివాస్ మనె (హంగల్ ఎమ్మెల్యే, కర్ణాటక)  పిసిసి ప్రతినిధులు యం.పి, చామల కిరణ్ కుమార్ రెడ్డి , పిసిసి ఉపాధ్యక్షురాలు, .ఆత్రం సుగుణ లు సోమవారం కరీంనగర్ చేరుకున్నారు.నియామక ప్రక్రియలో భాగంగా కరీంనగర్ జిల్లా పరిధిలోని  నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.

*అక్టోబర్ 14 మంగళవారం రోజు ఉదయం  నుండి మధ్యాన్నం  వరకు చొప్పదండి నియోజకవర్గంలో. మధ్యాహ్నం 02:00గం.ల నుండి సా.05:00గం.ల వరకు మానకొండూర్ నియోజకవర్గం  నేతల నుండి అభిప్రాయం సేకరిస్తారు. అక్టోబర్ 16 గురువారం రోజున ఉదయం హుజురాబాద్ నియోజకవర్గంలో .,మధ్యాహ్నం 02:00గం.ల నుండి సా.05:00గం.ల వరకు కరీంనగర్ నియోజకవర్గంలో  పర్యటిస్తారు. అక్టోబర్ 18 న *ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గం.ల వరకు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో  ఆశావాహులతో విడివిడిగా సమావేశం అవుతారు. అలాగే సివిల్ సొసైటీ, సోషల్, కమ్యూనిటీ గ్రూప్స్ తో చర్చలు జరుపుతారు. ఆశావాహుల నుండి సోమవారం దరఖాస్తులను స్వీకరించారు.స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  సమక్షంలో ఏఐసిసి టిపిసిసి పరిశీలకులకు అందజేస్తారు. ----

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 32 దరఖాస్తులు

---కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ , నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆశవహుల నుండి సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు.ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శులు నాత శ్రీనివాస్, దొంతి గోపి లకు ఆశావహులు దరఖాస్తులను నేరుగా అందజేయడం జరిగింది.  జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తూ 32 మంది దరఖాస్తు చేసుకోగా, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోరుతూ 22 మంది దరఖాస్తు చేసుకున్నారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు సమర్పించిన వారిలో వెలిచాల రాజేందర్ రావు, వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆరేపల్లి మోహన్, పత్తి కృష్ణారెడ్డి,   కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, కాశి పాక రాజేష్, సత్తు మల్లేశం, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆకారపు భాస్కర్ రెడ్డి, ఉట్కూరి నరేందర్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, నెల్లి నరేష్ మహమ్మద్ తాజుద్దీన్, మాచర్ల ప్రసాద్, దాసరి భూమయ్య, తిప్పారపు సంపత్, మహమ్మద్ ఖాలీముద్దీన్, మ్యాకల రవీందర్, సయ్యద్ జమాలుద్దీన్, మూల జైపాల్ పులి ఆంజనేయులు గౌడ్, మహమ్మద్ అబ్దుల్ సలాం, ఎస్.కె సిరాజ్ హుస్సేన్, శ్రీపురం నాగప్రసాద్, పడాల రాహుల్, దీకొండ శేఖర్, రుద్ర సంతోష్, ప్యాట రమేష్, గూడెపు సారంగపాణి, చర్ల పద్మ ఉన్నారు. 

నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోరుతూ దరఖాస్తు చేసిన వారిలో బానోతు శ్రావణి నాయక్ ముల్కల ప్రవీణ్ షబానా మహమ్మద్, కొరివి అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, మాచర్ల ప్రసాద్ సయ్యద్ ముజీబ్ హుస్సేన్ కంకణాల అనిల్ కుమార్ సర్దార్ ధన సింగ్ మహమ్మద్ అబ్దుల్ సలాం అస్తపురం రమేష్ ఎస్.కె సిరాజ్ హుస్సేన్ మహమ్మద్ జమాలుద్దీన్ అబ్దుల్ రెహమాన్ బోనాల శ్రీనివాస్ కొట్టే ప్రభాకర్ దీకొండ శేఖర్ గడ్డం శ్రీనివాస్ వీర దేవేందర్ పటేల్ వైద్యులు అంజన్ కుమార్ మహమ్మద్ ఇంతియాజ్ అలీ ఉన్నారు.